08-09-2025 11:18:07 AM
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా(Kulgam District)లోని గుద్దర్ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా, ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్దిష్ట నిఘా సమాచారం అందించిన తర్వాత ఆపరేషన్ ప్రారంభమైందని, ఆ తర్వాత భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్(CRPF) సంయుక్తంగా సోదాలు ప్రారంభించాయని అధికారులు తెలిపారు. “అప్రమత్తంగా ఉన్న దళాలు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించాయి. సవాలు చేయడంతో, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనితో భీకర కాల్పులు జరిగాయి. ఈ సమయంలో భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి గాయపడ్డారని.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భద్రతా అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఇద్దరు నుండి ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉండవచ్చని అధికారులు తెలిపారు. అదనపు బలగాలను మోహరించగా, ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.