08-09-2025 10:58:34 AM
హైదరాబాద్: ఎగువ నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriramsagar Project) 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 52,840 క్యూసెక్కులు ఉండగా, ప్రాజెక్టు ఔట్ ఫ్లో 53,685గా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1089 నీటి నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. ఇందిరమ్మ కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
నిండుకుండాల నాగార్జునసాగర్ జలాశయం..
నాగార్జునసాగర్(Nagarjunasagar Dam) 14 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా, ప్రస్తుతం 589.40 అడుగులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయం నీటి నిల్వ 310.25 టీఎంసీలు ఉంది. జలాశయం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,66,586 క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ కుడి కాలువకు 9500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. ఎడమ కాలువకు 8454 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు(Sripada Yellampally Project)కు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా 27841 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి, ప్రస్తుత నీటి నిల్వ 20.17 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 27841 క్యూసెక్కులు ఉంది.