7 July, 2026 | 2:21 AM

15 సెల్‌ఫోన్ల అప్పగింత

07-07-2026 01:29 AM

ములుగు (మహబూబాబాద్) జులై 6 (విజయక్రాంతి): ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న భాధితులు ఆన్లైన్ (సీ ఈ ఐ ఆర్ పోర్టల్ ) ద్వారా ఫిర్యాదు చేయగా ఫిర్యాదు నమోదు చేసుకున్న స్టేషన్ సిబ్బంది, వాటిని తిరిగి బాధితులకు అప్పగించడంలో భాగంగా ములుగు ఐటీ కోర్ టీం సహాయంతో ఇటీవల పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్లను విజయవంతంగా గుర్తించి, వాటిని సోమవారం బాధితులకు ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఐటి కోర్ టీమ్ ను అభినందించారు. వారి కృషి వల్ల తక్కువ సమయంలోనే మొబైల్ ఫోన్లు తిరిగి సాధించగలిగామని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి మిస్సింగ్ మొబైల్స్ రికవరీపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజలు తమ వ్యక్తిగత వస్తువుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని, మొబైల్ ఫోన్లు కోల్పోయిన వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేసుకోని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  ములుగు డిఎస్పి రవీందర్, ములుగు ఎస్‌ఐ చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.