07-05-2025 12:00:00 AM
మోతె, మే ౬:- మండల పరిధిలోని ఉర్లుగొండ గ్రామంలో మంగళ వారం ఈదురు గాలులకు శ్రీ లక్ష్మీ నరసింహ వైన్స్ షాపు రేకులు పూర్తిగా ధ్వంసం కాగా వైన్స్ షాపు నిర్వహణ ఊరు సెంటర్ లో ఉండటం తో ప్రమాదానికి కారణం అయినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
షాపుకు సంబంధించిన రేకుల షేడ్ రేకులు గాలిలో లేచి పోవడం తో నాలుగు బైక్ లు ఒక ఆటో తీవ్రంగా దెబ్బ తినడం తో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు వారిని 108 వాహనం లో దవాఖాన కు తరలించినట్లు గ్రామస్తులు తెలియజేశారు.