calender_icon.png 16 May, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీసరలో ఘోర ప్రమాదం.. మహిళ పైనుంచి దూసుకెళ్లిన బస్సు

26-08-2024 03:46:23 PM

కీసర: మేడ్చల్ జిల్లా కీసర ఆర్ఎల్ నగర్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆటో ఢీకొట్టడంతో కిందపడిన మహిళపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.