14-09-2025 04:09:10 PM
79 మంది యూనివర్సిటీ విద్యార్థులకు మోడల్స్ ప్రధానం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా నార్కట్ పల్లి మండలంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి ఉదయం 11 గంటలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 22 మంది పి హెచ్ డి సాధించిన విద్యార్థులు, 57 మంది గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేస్తారు. గవర్నర్ రాకను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా అధికారులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏర్పాట్లు, ఇతర అంశాలను అందులో పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఎం జి యూనివర్సిటీ లో పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే సోమవారం లోపలికి అనుమతిస్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ఆదిత్య భవనంలో అధికారులతో జరిగే రివ్యూ సమావేశంలో పాల్గొంటారు. గవర్నర్ నల్లగొండకు మొదటిసారి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.