14-09-2025 04:12:00 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): మహిళలు, స్త్రీలు ఈ కాలంలో వెనుకబాటుతనాన్ని విడిచి అన్ని రంగాల్లో రాణించాలని, స్త్రీలకు దేవుని రాజ్యంలో ప్రత్యేక స్థానం కల్పించబడిందని సిస్టర్ ప్రవచనమ్మ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆలయంలో, డయాసిస్ మెదక్ ఆలయ ఆదేశాల అనుసారం స్త్రీల మహిళల ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా స్త్రీలు మాత్రమే ఆలయ ఆరాధనను ముందుండి నడిపించారు.
ఈ సందర్భంగా సమాజంలో సావిత్రిబాయి పూలే ,ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహిళలు వీరోచితంగా ముందుకు సాగినట్లుగా చూస్తున్నామని, బైబిల్ లోని ప్రవక్తలు దెబోరా, ఎస్తేరు, యోహాన్న ,సూసన్న, మగ్దలేనె మరియ వంటి వారిని ఉదాహరణగా తీసుకొని స్త్రీలు సంఘంలో, సమాజంలో, కుటుంబంలో ,బాధ్యతగా మెలగాలని ప్రవచనమ్మ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ రెవరెండ్ నక్క కిరణ్ కుమార్, స్త్రీల సమాజం సెక్రటరీ చంద్రకళ ఆంథోనీ ,స్టువర్డ్ గంగుల దేవదాస్ ,సునీత ,ఆశీర్వాదం, రవికాంత్ ,సుశీలమ్మ ,మేరీ, సుజాత విలియమ్స్, విద్యాలత, దీప ,శంకరమ్మ ,గీత ,పుష్ప, తదితరులు ఉన్నారు.