calender_icon.png 14 September, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగ జీవితంలో ఒక భాగం

14-09-2025 04:10:22 PM

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): యోగ అనేది నేటి మానవ దైనందిక జీవితంలో ఒక భాగం కాబోతున్నదని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. యోగ వల్ల, శారీరక దారుఢ్యమే కాకుండా మానసిక వికాసము క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ   కార్యాలయంలో జరిగిన 12వ సీనియర్ అంతర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. యోగా శిక్షణా తరగతులను,  ప్రాథమిక విద్యా తరగతుల నుండే తప్పనిసరి చేయాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు కళాశాలలో యోగ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాలను ప్రాధాన్యతలోకి తీసుకోవాలని కోరారు.

గత ప్రభుత్వం యోగ కు సమచితమైన ప్రాధాన్యత ఇచ్చిందని, పలువురు యోగా శిక్షకులకు, యోగాలో ప్రావీణ్యం సంపాదించిన వారికి నగదు సహాయం చేయడమే కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించిందని తెలిపారు.యోగా విన్యాసాల్లో ప్రావీణ్యం ప్రదర్శించిన పలువురికి మెమెంటోలు శాలువాలతో కంచర్ల సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ మనోహర్, తెలంగాణ యోగ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం సుధాకర్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు , సిరిగిరి వెంకట్ రెడ్డి ,మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి ,సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్ , యోగా అసోసియేషన్ నల్లగొండ జిల్లా కార్యదర్శి నాగార్జున  తదితరులు పాల్గొన్నారు.