calender_icon.png 21 August, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హామీలను అమలు చేయాలి

21-08-2025 05:01:48 PM

తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బిజెపి నాయకులు..

బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండలం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బిజెపి నాయకులు గురువారం ఇంచార్జ్ తహసీల్దార్ నిమ్మ భూపేష్(In-charge Tehsildar Name Bhupesh)కు వినతి పత్రం అందించారు. భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వినతి పత్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాలనలో మండలంలో ఉన్న సమస్యలను పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరిట అధికరంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బోయిన్ పెల్లి మండలంలో ఉన్న లో లెవెల్ వంతెనలను ఇప్పటివరకు కూడా నిర్మించలేకపోయిందన్నారు. బోయిన్పల్లి నుండి వేములవాడ పోయే రహదారిలో ఉన్న గంజి వాగు వద్ద పిల్లర్లు వేసి ఇడిచి పెట్టినారు కానీ బ్రిడ్జి పోయకపోవడం వలన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లాలంటే బోయిన్ పెల్లి మండల ప్రజలకు అదే విధంగా వివిధ జిల్లాల నుండి మండలాల నుండి గ్రామాల నుండి వస్తే భక్తులకు ఇబ్బంది కలుగుతున్న పట్టించుకోవడం లేదని తెలిపారు.

నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా చొప్పదండి  శాసనసభ్యులు మేడిపెల్లి సత్యం  గారు, తొందరగానే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు బ్రిడ్జి పూర్తి కాలేదు, గంజి వాగు వద్ద బ్రిడ్జి కాకుండా మండలంలో ఉన్న లో లెవెల్ వంతలను హై లెవెల్ వంతెనలు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని , అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన లబ్ధిదారులకు ఏలాంటి మట్టి కొరత లేకుండా ఇసుక కొరత లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమం మండల శాఖ అధ్యక్షుడు ఎడపల్లి పరుశరాములు  ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో  బిజెపి మాజీ మండలాధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి  నరసింహాచారి, బిజెపి మండల నాయకులు, బొంగాని అశోక్ గౌడ్, జువ్వెత్తుల శ్రీనివాస్ రెడ్డి, సారం పెళ్లి రాజు  తుమ్మనపల్లి కిరణ్, అమిరి శెట్టి గంగయ్య, బోగోజి గంగాధర్ చారి, మెరుపుల గంగాధర్ గౌడ్, అమిరిశెట్టి అంజయ్య, రమేష్, సావనపల్లి అనిల్, ఆంజనేయులు,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.