calender_icon.png 21 August, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ ఎమ్మెల్యే కూతురు జన్మదిన వేడుకలు

21-08-2025 04:57:01 PM

పాల్గొన్న మాజీ మంత్రి గుంతకండ్ల

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి జన్మదిన వేడుకలు గురువారం జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలోని తన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంత కండ్ల జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) పాల్గొని కేక్ కట్ చేసి ఆశీర్వదించారు. రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం, సత్తయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్ తిప్పర్తి నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య,పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.