calender_icon.png 21 August, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో వృద్ధులను గౌరవించడం మనందరి బాధ్యత

21-08-2025 04:48:37 PM

తుంగతుర్తి లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి

తుంగతుర్తి (విజయక్రాంతి): సమాజంలో వృద్ధులను గౌరవించడం మనందరి బాధ్యత అని తుంగతుర్తి లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి(Lions Club Vice President Tallada Kedari) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనములో జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు ఓరుగంటి సరోజనమ్మ అంతయ్య దంపతులు, తల్లాడ నారాయణ, బండారి రాములను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని వృద్ధులు మన తల్లిదండ్రులతో సమానమని వారిని గౌరవించడం, అవకాశం ఉన్నచో సేవలు చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి లైన్స్ క్లబ్ కోశాధికారి గుండగని రాము కోఆర్డినేటర్లు ఓరుగంటి శ్రీనివాస్, ఓరిగంటి సుభాష్ ఎనగందుల సంజీవ, ఎనగందుల గిరి, వేణు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.