21-08-2025 04:58:45 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంజయ్ స్వీట్ షాప్ ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వలిగొండ పట్టణ కేంద్రంలో పెద్దఎత్తున బేకరీ, స్వీట్ హౌస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షాప్ యజమాని సంజయ్, పాశం సత్తిరెడ్డి, బత్తిని సహదేవ్, కొండూరు భాస్కర్, కిష్టయ్య, సాయి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.