07-10-2025 12:47:16 AM
మానకొండూరు, అక్టోబర్ 6 (విజయ క్రాంతి)మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ఇద్దరు వ్యక్తులు జగ్గయ్యపల్లి నుండి అన్నారం వెళ్తుండగా ఈ ప్రమా దం జరిగింది. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఒకరు టైర్ కింద పడ్డాడు. దీంతో రామగిరి రాకేష్ (28) కాలు నుజు నుజ్జు కాగా, నరేష్ కు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలట్ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని గా యపడ్డ వ్యక్తులకు ప్రథమ చికిత్స అందిస్తూ కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.