18-12-2025 08:35:15 PM
రెండు బైకులు ఎదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలు..
చేర్యాల: జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన చేర్యాల పట్టణ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన ప్రశాంత్(35) ద్విచక్రవాహనంపై జనగామ వైపు వెళుతుండగా అదే సమయంలో నంగునూరు మండలంలోని దర్గపల్లి గ్రామానికి చెందిన బాల్ రెడ్డి(55) అతని భార్య రజిత(45) తమ ద్విచక్ర వాహనంపై చేర్యాల వైపుకు వస్తుండగా ప్రమాదవశాత్తూ రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 కు కాల్ చెయ్యగా గాయాలు అయిన వారిని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.