22-09-2025 01:23:37 AM
నిర్మల్ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు రైతులు పంటలు నష్టపోయారు. అందుకుగాను ప్రభుత్వ వెం టనే స్పందిచి తగిన చెర్యలు తీసుకోని రైతు లను ఆదుకోవాలని, నష్టపరిహారాన్ని అం దించాలని రైతులు కోరుతున్నారు. వర్షాల కారణంగా నిండిన చెరువుల కట్టలు తెగడంతో పంటలు నష్టపోవడం,
రహదా రులు ద్వంసం కావడంతో వాటి మరమ్మ త్తుల నిమిత్తం నిధుల కోసం ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వర్షాల కారణంగా వరదలు ఏర్పడి కొండం త నష్టాన్ని కలిగించిన ప్రభుత్వం గోరంత సాయాన్ని ప్రకటించడంతో ఈ పనులు పూర్తి చేయడం అధికారులకు కత్తి మీద స్వాములగే తయారయింది. తాత్కాలిక మరమ్మతుల పేరుతో జిల్లాకు కొద్ది మొత్తంలోని నిధులు మంజూరు కావడంతో అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు.
కొండంత నష్టం గోరంత సాయం
జిల్లాలో ఆర్ అండ్ బి పరిధిలో 150 కిలోమీటర్ల పొడవున రోడ్లు ధ్వంసం కావ డంతో మరమ్మత్తు పనులను చేపట్టవలసి ఉంటుంది. ఎందుకు ప్రభుత్వానికి తాత్కాలిక మరమ్మత్తుల కోసం 2.20 కోట్లు అవసరమని జిల్లా యంత్రాంగం ప్రతిపానులు పంపగా కేవలం నియోజకవర్గానిక 66 లక్షలు మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు చెప్తున్నారు.
గండ్లు పడి రోడ్లు ధ్వజమైన ప్రాంతాల్లో బ్రిడ్జిలు కొట్టుకపోవటం రోడ్లు కూత గురి కావడం కలవాటులు తెగిపోవడం వంటి శాశ్వత పనులకు కనీసం 40 కోట్ల వరకు నిధులు మంజూరు అయితే కానీ పనులు పూర్తిస్థాయిలో జరిగే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. పంచాయతీరాజ్ పరిధిలో 517 కిలోమీటర్ల పొడవులో 150 కిలోమీటర్లు రోడ్డు ధ్వంసం అయినట్టు అధికారులు తెలిపారు 122 కిలోమీటర్లు వివిధ పంచాయతీ రాజ్ రోడ్డు తెగిపోవడం కోతకు గురికావడం జరిగింది.
72చోట్ల తక్షణం తాత్కాలిక పనులకు 1.75 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతి పనులు పంపగా కేవలం నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గంలోని పంచా యతీ రాజ్ రోజులకు 15 లక్షల చొప్పున 45 లక్షలు మాత్రమే నిధులు మంజూరైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్ రోడ్లను శాశ్వతంగా పునరుద్ధరించేందు కు చేసేందుకు 20 కోట్ల వరకు నిధులు అవసరమని అంచనా వేశారు.
ఇక నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న చెరువులు కుంటలకు కూడా వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. జిల్లాలో 720 చెరువులు ఉంటే వర్షాలు వరదలు ఎక్కువగా ఉన్న బాసర కుంటల కుబీర్ నర్సాపూర్ సారంగాపూర్ బైంసా మండలాలు చెరువులకు తీవ్ర నష్టం కలిగింది. మొత్తం ఎనిమిది చెరువులకు గండిపడగా 28 చెరువుల అలుగులు ధ్వంసం చేశారు. పంట కాలువలు దెబ్బతిన్నాయి.
రాష్ర్ట ప్రభుత్వం భారీ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న జిల్లాలకు వరద సాయం కింద ఇప్పటికే 200 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను ఆ జిల్లాలకు కేటాయించగా నిర్మల్ జిల్లాలో ఎక్కువ నష్టం జరిగినప్పటికీ నిధులు మాత్రం అరకురగా రావడంతో ఈ వానకాలం సీజన్లో ఈ పనులు పూర్తిచేసే పరిస్థితి లేకపోవడంతో తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
తాత్కాలిక పనులు వేగవంతం
జిల్లాలో రాహదారులు, చెరువులకు తాత్కాలిక మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో మరమ్మత్తులు చేసే పరిస్థితి లేకపోగా ప్రస్తుతం ఎండలు కొట్టడంతో తెగిపోయిన రోడ్లను మొరంతో నింపడం కోతకు గురైన రోడ్లను మరమ్మతులు చేపట్టడం గుంతలు పూడ్చ డం,
కలవట్లు రిపేరు చేయడం వంటి పనులను జిల్లా యంత్రాంగం నిర్వహిస్తోంది. జిల్లాలోని పంచాయతీ రాజ్ ఆర్ అండ్ బీ శాఖల పరిధిలో ఈ పనులను చేపడుతుండగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.