calender_icon.png 8 January, 2026 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత

06-01-2026 01:04:18 AM

ఆదిలాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు భాగంగా సోమవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత నియమాలపై ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, అధికారులు ఫోటోలు దిగి ప్రతిజ్ఞ చేశారు.

ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ.... జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్స్పాట్లను గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, సీఐ సునీల్, ఇన్‌స్పెక్టర్లు హరీంద్ర కుమార్, ప్రదీప్, రవాణా, పోలీస్ శాఖల అధికారులుపాల్గొన్నారు.