calender_icon.png 9 January, 2026 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజాను అరికట్టాలి

06-01-2026 01:02:45 AM

  1. అక్రమ సరఫరాపై కఠిన చర్యలు తప్పవు
  2. పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): చైనా మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మడానికి, కొనడానికి వీలు లేకుం డా పూర్తిస్థాయిలో అరికట్టాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. చైనా మాంజా వల్ల మనుషులకు, పక్షులకు, వన్యప్రాణులకు తీవ్ర ప్రమాదాలు ఏర్పడుతున్న నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నా రు. అటవీ దళాల ప్రధాన సం రక్షిణాధికారిణి డాక్టర్ సి. సువ ర్ణ అధ్యక్షతన అరణ్యభవన్‌లో వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

చైనా మాంజా తయారీ, సరఫరా, విక్రయాలపై జరుగుతున్న అక్రమ కా ర్యకలాపాలను గుర్తించి, వా టిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా  సువర్ణ మాట్లాడుతూ.. ప్రమాదకర దారాలు ఏ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి దిగుమతి అవుతున్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు.