calender_icon.png 10 November, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి

10-11-2025 08:59:43 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో వ్యాపారస్తులు, ప్రజల సౌకర్యార్థం రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట రోడ్డు, డ్రైనేజీలకు మరమ్మతులు నిర్వహించాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకుడు మాయ రమేష్ కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, డివై ఈఈ సుమతి లను కలిసి రోడ్లు, డ్రైనేజీల గురించి వివరించగా, సానుకూలంగా స్పందించిన మున్సిపల్ అధికారులు వెంటనే ఏఈ వినీత్ తో మార్కెట్ ప్రాంతంలో సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా మాయ రమేష్ మాట్లాడుతూ, రోడ్డు, డ్రైనేజీలకు సంబంధించి త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామని మున్సిపల్ ఏఈ హామీ ఇచ్చారని, అదేవిధంగా పట్టణంలోని రాజా చికెన్ సెంటర్ ముందు వేసిన రోడ్డు ను తిరిగివేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, డివైఈఈ సుమతి, ఏఈ వినీత్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.