10-11-2025 09:14:06 PM
భైంసా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ఆకాష్..
కుబీర్ పీ హెచ్ సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ వో..
కుభీర్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించి మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భైంసా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ఆకాష్ సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆవరణలో పేరుకుపోయిన చెత్తను చూసి అవాక్కయ్యారు. ఆసుపత్రి ముందు భాగంతో పాటు వెనుక చుట్టూరా ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో అసహ్యం వ్యక్తం చేశారు.
వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ఉన్న చెత్తాచెదారంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు తాగునీరు కనీస సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన హాజరు రిజిస్టర్, డ్యూటీ రిజిస్టర్ లను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పలువురు రోగులతో ఆయన మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. శని ఆదివారాలు సైతం రోగులకు సేవలు అందించాల్సిందేనని హెచ్చరించారు. ఆదివారం ఆసుపత్రిని మూసి ఉంచడం పై ఆయన మండిపడ్డారు. అనంతరం ఆయన ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పరు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ రాథోడ్ విజేష్, సిబ్బంది ఉన్నారు.