10-11-2025 09:20:32 PM
ఎస్ఈ జాడే ఉత్తమ్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి నాణ్యమైన కోతలు లేని విద్యుత్ అందించడం కోసమే అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామని మంచిర్యాల ఎన్పిడిసిఎల్ సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ జాడే ఉత్తమ్ పేర్కొన్నారు. సోమవారం మండలం లోని సూరారం సబ్ స్టేషన్ లో అదనంగా 5 ఎంఏ గల పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. లో ఓల్టేజి లేకుండ నాణ్యమైన విద్యుత్ సరఫరాతో వ్యవసాయ విద్యుత్ మోటర్లు కాలిపోకుండ ఉండడానికే రైతు ఆర్ధికంగా నష్ట పోకుండా నాణ్యమైన విద్యుత్ అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ ఎంఎ కైసర్, డీఈ ఎంఆర్టి బానోత్ రాజన్న, ఎంఆర్టి ఏడిఈ శరత్ కుమార్ లక్షెట్టిపేట ఎడిఈ ఎం. ప్రభాకర్ రావు, అబ్దుల్ కలీం, ఏఈ ఎంఆర్టి, ఏఈ గణేష్ సిబ్బంది పాల్గొన్నారు.