10-11-2025 09:08:34 PM
కొండాపూర్: కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ సహకార సంఘం అధ్యక్షుడు ఆకుల పవన్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం సన్న వడ్లకు 500 బోనస్ ప్రకటించినందున రైతులు దళారులను నమ్మకుండా నేరగా సొసైటీల వద్దే వడ్లు అమ్మాలని సొసైటీల వద్ద వడ్లకు సరైన తూకం మద్దతు ధర లభిస్తుందని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వయోలతో పాటు సొసైటీ డైరెక్టర్లు వీరేశం, పట్నం సురేష్, అనంతయ్య, శంకర్, శ్రీనివాస్ రెడ్డి, రాములు, మాజీ ఎంపీటీసీలు విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రైతులు దేవయ్య, ఎల్లయ్య, మౌలానా, యాదగిరి, మహేందర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీశైలం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.