23-10-2025 01:22:20 PM
భారత్, ఆస్ట్రేలియా(India vs Australia) జట్ల మధ్య రెండో వన్డే మ్యాచులో ఆస్ట్రేలియాకు భారత్ 265 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(73), శ్రేయస్ అయ్యర్(61) హాప్ సెంచరీలతో అదరగొట్టారు. అక్షర్ పటేల్ (44), హర్షిత్ రాణా(24), అర్షదీప్(13) పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4, బార్ట్ లెట్ 3, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచులో భారత టెయిలెండర్లు అర్షదీప్-హర్షిత్ రాణా సూపర్ బ్యాటింగ్ చేశారు. వీళ్లు 24 బంతుల్లో 33 పరుగులు రాబట్టారు. ఆడమ్ జంపా వేసిన 47వ ఓవర్ లో హర్షిత్ మూడు బౌండరీలు కొట్టాడు. దూకుడుగా ఆడిన అక్షర్ పటేల్ 44 పరుగులు చేసి కాస్తలో హాప్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి వన్డేలో మాదిరిగానే విరాట్ కోహ్లీ డకౌట్(virat kohli duck out) అయి ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు. బార్ట్ లెడ్ బౌలింగ్ లో విరాట్ ఎల్బీగా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఆసీస్ పై వరస ఇన్నింగ్స్ లో డకౌట్ కావడం కోహ్లీ కెరీర్ లో ఇదే మొదటి సారి. డకౌట్ కు వెళ్తూ తీవ్ర నిరాశతో కోహ్లీ అభివాదం చేశాడు.