26-10-2025 12:00:00 AM
చివరి వన్డేలో భారత్ ఘనవిజయం
సిడ్నీ, అక్టోబర్ 25: ఆస్ట్రేలియా టూర్‌లో భారత్ తొలి విజయాన్ని రుచి చూసింది. వరుసగా రెండు ఓటములతో సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి వన్డేలో మాత్రం దుమ్మురేపింది. ఆల్ రౌండ్ షోతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. రోహిత్ శర్మ సెంచ రీతో చెలరేగిన వేళ...కోహ్లీ హాఫ్ సెంచరీ బాదగా భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది.
బౌలింగ్‌లో హర్షిత్ రాణా 4 వికెట్లతో రాణిం చా డు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నితీశ్ రెడ్డి గాయపడడంతో ఎట్టకేలకు భారత తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. అర్షదీప్‌కు రెస్ట్ ఇచ్చి ప్రసిద్ధ కృష్ణను ఆడించారు. భారీస్కోర్ చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 61 పరు గులు జోడించారు.
అయితే పవర్ ప్లే తర్వాత భారత బౌలర్లు ఆసీస్ జోరుకు బ్రేక్ వేశారు. హర్షిత్ రాణా, సిరాజ్ లైన్ అండ్ లెంగ్త్ అందుకోవడంతో ఆసీస్ బ్యాట ర్లు ఒత్తిడికి లోనయ్యారు. ముఖ్యంగా హర్షిత్ రాణా సూ పర్ బౌలింగ్‌తో వరుస వికెట్లు పడగొట్టాడు. అటు స్పిన్నర్లు కూడా జత కలవడంతో ఆస్ట్రేలియా 200 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా రెన్షా మాత్రం నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు.
రెన్షా 56 పరుగులకు ఔటైన తర్వాత కూపర్ కన్నో లి, నాథన్ ఎల్లిస్ కాసేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో స్కోర్ 230 దాటగలిగింది. అయినప్పటకీ భారత బౌలర్లు ఆధిపత్యం కనబరచ డంతో కంగారూలు పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయారు. చివరికి 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. హర్షిత్ రాణా 4/39 స్పెల్‌తో సత్తా చాటితే వాషింగ్టన్ సుందర్ 2/44, సిరాజ్ 1/24, అక్షర్ పటేల్ 1/18 రాణించారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో క్యాచ్‌ల సెం చరీ పూర్తి చేసుకున్నాడు.
237 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కు ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 69 పరుగులు పార్టనర్‌షిప్ నెలకొ ల్పారు. గిల్(24) ఔటైనప్పటకీ.. విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆసీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన రోకో ద్వ యం కీలకమైన పార్టనర్‌షిప్‌తో మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా మార్చేసింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. కోహ్లీ హాఫ్ సెంచ రీ సాధించాడు.
రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఒకప్పటి తమ బ్యాటింగ్‌ను అభిమానులకు గుర్తు చేశారు. ముఖ్యంగా రోహిత్ కొట్టిన సిక్సర్లు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 168 పరు గుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఛేజింగ్‌లో భారత్ అలవోకగా గెలిచింది. కేవలం 38.3 ఓవర్లలోనే 1 వికెట్ మాత్రమే కోల్పో యి టార్గెట్‌ను అందుకుంది. రోహిత్ శర్మ 121(13 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లీ 74 (7 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు.
ఈ విజయంతో క్లీన్‌స్వీప్ అవమానాన్ని తప్పించుకు న్న భారత్ ఆసీస్ ఆధిక్యాన్ని 1 తగ్గించింది. సిరీస్‌లో 202 పరుగులు చేసిన రోహిత్ శర్మకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయ ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఐదు టీ ట్వంటీల సిరీస్ అక్టోబర్ 29 నుంచి మొదలవుతుంది.
స్కోర్లు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : 236 ఆలౌట్(46.3 ఓవర్లు)( రెన్షా 56, మార్ష్ 41, షార్ట్ 30; హర్షిత్ రాణా 4/39, వాషింగ్టన్ సుందర్ 2/44)
భారత్ ఇన్నింగ్స్ : 237/1(38.3 ఓవర్లు)( రోహిత్ శర్మ 121 నాటౌట్, కోహ్లీ 74 నాటౌట్ ; హ్యాజిల్‌వుడ్ 1/23)