27-10-2025 12:43:07 AM
హైదరాబాద్, అక్టోబర్ 26: తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్, తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ పోటీలు ముగిసాయి. పలువురు చిన్నారులు అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. షో జంపింగ్ జూనియర్ (90 సెం.మీ)విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఐజా మిర్ విజేతగా నిలి చింది.
82.96 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మహ్మ ద్ ఖలీద్ అలీ, రెడ్డి వంగా అభిరాజ హుసేన్ జియాద్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. జంపింగ్ చిల్డ్రన్ (60 సెం.మీ) విభాగంలో మహ్మద్ ఒమర్ ఖురే షి విజేతగా నిలిస్తే... నివేద్ రెడ్డి కొట్ట, పోతినేని ధృవ, మహ్మద్ అమీర్ షాన్వాజ్ తర్వా తి స్థానాల్లో నిలిచారు.
జంపింగ్ చిల్డ్రన్ (60 సెం.మీ)ఓపెన్ విభాగంలో మహ్మద్ ఖలీద్ అలీ మొదటి స్థానంలోనూ, హుసేన్ జియా ద్, శివకుమార్ తర్వాతి స్థానాల్లోనూ నిలిచారు. విజేతలను తెలంగాణ టూరిజం స్పెష ల్ సెక్రటరీ జయేశ్ రంజన్, జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, హెచ్‌పీఆర్‌సీ ప్రెసిడెంట్ చైతన్య అభినందించారు.