16 April, 2026 | 9:09 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం

05-05-2025 02:52 AM

కరీంనగర్  క్రైమ్, మే 4 (విజయ క్రాంతి):  జిల్లా కేంద్రంలోని హోటల్లో ఆదివారంకరీంనగర్ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా చేయిర్మెన్ కనకం కుమారస్వామి ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం  నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, టి యు ఎఫ్ చైర్మన్ చీమ శ్రీనివాస్, ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొరకు ఆహర్నిశలు కష్టపడి రాష్ట్రం సిద్ధించేంతవరకు కొట్లాడినటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు నెరవేరలేదన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు తప్పకుండా అమలుపరచాలని, ఉద్యమకారుల యొక్క ఆర్థిక స్థితిగతులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

ప్రతి నిజమైనటువంటి ఉద్యమకారునికి 250 చదరపు గజాల భూమితో పాటు 25 వేల పెన్షన్, వైద్య సదుపాయాలు, వారి పిల్లలకు ఉచిత విద్య అవకాశాలు కల్పించి వారిని తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో వారికి భాగం కల్పించాలని వారికి ఆర్థిక మనోధైర్యం నింపాలని కోరారు. ఈ  కార్యక్రమం లో వివిధ జిల్లాల అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు తదితరులు, పాల్గొన్నారు