05-05-2025 02:51:34 AM
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, మే 04 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన కనీస సౌకర్యాలు, వైద్యం అందించడమే ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రాజ్ పల్లిలో రూ. కోటి 43 లక్షల తో ఆర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి భూమి పూజ నిర్వహించారు.
శాత్రాజ్ పల్లి చాలా చైతన్య వంతం కలదని, .ఎందరో ప్రభుత్వ ఉద్యోగులను అందించిన చరిత్ర దీనికి గలదని గుర్తు చేశారు. అనాడు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చెస్తూ ముందుకూ పోతున్నామని స్పష్టం చేశారు. శాత్రాజ్ పల్లిలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ ప్రాంతం వైద్యానికి హబ్ గా ఏర్పడుతుందని వివరించారు.
వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ బస్టాండ్ నుండి చెక్ డ్యామ్ వరకు, మిగిలిన బండ్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శంకుస్థాపన చేశారు.కార్యక్రమాల్లో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రాకేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.