calender_icon.png 3 December, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ. 1.55 కోట్ల చెక్కుల పంపిణీ

03-12-2025 12:00:00 AM

కందుకూరు, డిసెంబర్ 2 ( విజయక్రాంతి ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కందుకూరు దీర్ఘకాలిక అప్పు పొందిన రైతులకు పిఏసిఎస్ చైర్మన్ అధ్యక్షతన హాజరైన పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో 14 మందికి సుమారు రూ. 1. 55 కోటి మంజూరు చేసిన చెక్కులను రైతులకు పంపిణి చేశారు.ఈ సందర్బంగా దేవరశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ, పిఏసిఎస్లో మొక్కజొన్న కొనుగోలు చేయబడిన బస్తాలు సుమారు 140 మంది రైతుల నుండి 22 వేల బస్తాలను కొనుగోలు చేసి ఇందులో 20 వేల బస్తాలను తెలంగాణ మార్క్ ఫెడ్ కు పంపిణి చేశామన్నారు.

అదేవిధంగా రైతులు దళారులను నమ్మి ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సంఘ అభివృద్ధికి తోడ్పడాలని,సంఘం ద్వారా కొత్తగా అప్పు దరఖాస్తులు చేసుకోని సకాలంలో వడ్డీతోపాటు కిస్తులను  చెల్లించగలరని ఛైర్మెన్ దేవరశెట్టి చంద్రశేఖర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ కమిటీ పాలకవర్గ సభ్యులు సురసాని శేఖర్ రెడ్డి,నర్ల నరసింహా,గౌర పర్వతాలు, తీగల జగదీశ్వర్ రెడ్డి,సాద పాండు రంగారెడ్డి, మెఘవత్ చంద్రు నాయక్,పొట్టి ఆనంద్, సంఘ ఇంచార్జ్ సెక్రెటరీ కాలే మహేష్,సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.