03-12-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 2 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని పెద్ద చెరువులో మురికి నీళ్లు కలుస్తాం కాకుండా మూడు కోట్ల 25 లక్షల జిహెచ్‌ఎంసి నిధులతో చెరువు సమీపంలో పెద్ద పైపులను దింపడం జరిగిందని మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ పెద్ద చెరువులో కలుషిత నీరు కల్వకుండ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేడ్చల్ మున్సిపల్ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్ర ప్రకాష్ రెడ్డి, డిఈ విజయలక్ష్మి, మేడ్చల్‌మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్‌లు కౌడే మహేష్ కురుమ, జాకట దేవరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకు లు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, టైలర్ రాజు గౌడ్, దుర్గం వెంకటేష్ ముదిరాజ్, ఆర్ సంతోష్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి దాత్రిక లింగం, బర్ల సంతోష్, పానుగంటి మహేష్, రాకేష్ పాల్గొన్నారు.