13-12-2025 01:10:37 AM
అండగా ఉంటామన్న మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఇటీవల బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పరిహారం అందజేసింది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జగద్గిరిగుట్టలోని ఈశ్వరాచారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెక్‌ను అందజేశారు. శుక్రవారం ఈశ్వరచారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు.
అంతకుముందు ఈశ్వరాచారి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. వీరివెంట బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనిల్‌తోపాటు మరికొంత మంది నాయకులున్నారు.