16-12-2025 07:51:16 PM
టీపీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్..
ఎల్బీనగర్ (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ లోని డివిజన్లు శాస్త్రీయంగా పునర్విభజన చేయాలని ప్రభుత్వాన్ని టీపీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ కోరారు. హయత్ నగర్ డివిజన్ లో మార్పులు చేసి, కొత్త ప్రాంతాలను విలీనం చేయాలని మంగళవారం జోనల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులకు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గజ్జి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. డివిజన్లో విభజనలో భాగంగా హయత్ నగర్ డివిజన్ కొన్ని మార్పులు చేయాలని కోరారు.
హయత్ నగర్ పాత గ్రామానికి ఆనుకొని ఉన్న ఆనంద్ నగర్ కాలనీ, పద్మావతి కాలనీ ఫేస్, తెలంగాణ పద్మావతి కాలనీ, పద్మావతి కాలనీ, శ్రీనివాస కాలనీ, వస్పర్ కాలనీ, ఫాతిమానగర్, మాల బస్తి, హయత్ నగర్ బస్ డిపో వరకు ఉన్న ప్రాంతాన్ని హయత్ నగర్ డివిజన్ లోని కలపాలని సూచించారు. చారిత్మాత్మక చరిత్ర కలిగిన హయత్ నగర్ ఉనికిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
- లెక్చరర్స్ కాలనీ డివిజన్ ను బాగ్ హయత్ నగర్ గా మార్చాలి
నూతనంగా ఏర్పాటు చేసిన లెక్చరర్స్ కాలనీ డివిజన్ ను బాగ్ హయత్ నగర్ డివిజన్ గా ప్రకటించాలని దళిత సంఘాల నాయకులు కోరారు. 450 సంవత్సరాలు చరిత్ర కలిగిన హయత్ నగర్ తాలూకా పంచాయతీ సమితిగా, మండలంగా కొన్ని వందల గ్రామాలకు సేవలు అందించిన ఘనత ఉందన్నారు. హయాత్ బక్షీ మసీదు, పెద్ద మసీదు, చిన్న మసీదు, హత్తి బౌడి తదితర చారిత్రక కట్టడాలు ఉన్నాయని తెలిపారు. హయత్ నగర్ చరిత్రను కాపాడే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారంద స్వామి, దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఎర్ర రవీందర్, కాంగ్రెస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు గజ్జి శ్రీనివాస్ యాదవ్, గజ్జి సాయి తదితరులు పాల్గొన్నారు.