16-12-2025 07:50:51 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్.రాంచంద్రరావు జిహెచ్ఎంసి లో విలీనం ఐన మేడ్చల్ రూరల్ ప్రాంతాలలో గల మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా ప్రాంతాల్లో డివిజన్ల విభజన గురించి, స్థానిక బీజేపీ నాయకులు, ప్రజలు అనుకూలమా లేక వ్యతిరేకమా అనే అంశంపై చర్చించి, వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి అధ్యక్షులు డా ఎస్. మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. విగ్నేశ్వర్, దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, మాజీ కౌన్సిలర్ ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్, వివిధ డివిజన్ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.