16-12-2025 08:02:01 PM
ఎల్బీనగర్ (విజయక్రాంతి): హయత్ నగర్ 1 డిపో నుంచి హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్లలోని నూతన కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించారు. ఈ మేరకు బస్సు సర్వీసులను మంగళవారం డిపో మేనేజర్ విజయ్ ప్రారంభించారు. హరిహరపురం, కుంట్లూర్ జయ ప్రకాష్ నగర్ కాలనీ, తొర్రూర్ డబల్ రూమ్ కాలనీలో బస్సులను స్థానికులతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో విద్యార్దులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.