calender_icon.png 16 December, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులను విలీనం చేయొద్దు

13-12-2025 01:11:55 AM

  1. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
  2. విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్ పంపిణీ చేయాలి
  3. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాం తి): ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ను కలిపి ఒకే బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, వీటిని విలీనం చేయొద్దని తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, తెలంగాణ గవర్నమెంట్ జూ నియర్ కాలేజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి కోరారు. శుక్రవారం నాంపల్లిలోని అసోసియేషన్ రాష్ట్ర కా ర్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలనపై ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు.

విలీనానికి సంబంధించి అధ్యాపకులు, కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రు లు, విద్యార్థి సంఘాల నుంచి అభిప్రాయా లు తీసుకోకుండా ఒకే బోర్డును ఎలా చేస్తారని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలో చన చేయాలని విజ్ఞప్తిచేశారు. గత పదేళ్లలో కంటే కూడా ఈ రెండేళ్ల పాలనలో ఇంటర్మీడియట్ విద్యలో ఎన్నో సంస్కరణలు వచ్చా యని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులకు మధ్యా హ్న భోజనం అమలు చేయాలని కోరారు.

విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్ అందజే యాలని, ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వ కాలేజీలకు ప్రతి నెల రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు మెయిన్‌టెనెన్స్ గ్రాంట్ నిధులను విడుదల చేయడం శుభపరిణామమ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1,300 మంది అధ్యాపకులను నియమించారని, 326 జూనియర్ కాలేజీలకు మౌలిక వసతులు, మరమ్మతుల కోసం రూ.56.16 కోట్ల ను మంజూరు చేశారని చెప్పారు.

విద్యార్థుల హాజరు శాతం, అధ్యాప కులలో జవాబుదారీతనం కోసం సీసీ కెమెరాలు, ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నియంత్ర ణ చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. పరీక్షల సంస్కరణల్లో భాగంగా విద్యార్థుల హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించడం, ప్రశ్నపత్రాల ముద్ర ణ, రీవాల్యుయేషన్‌లో సంస్కరణలు చేపట్టిందన్నారు.

సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ బలరామ్ జాదవ్, వైస్ ప్రెసిడెంట్ కే కవిత కిరణ్, అసోసియేట్ ప్రెసిడెంట్‌లు ఆర్ మాధవరావు, ఎస్ శ్రీనివాస్‌తోపాటు నాయకులు వీ ఆంజనేయరా వు, కే రవీందర్‌రెడ్డి, జీ సునీత, కే రజిత, కే లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.