13-12-2025 01:08:56 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాం తి): కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ ఇయర్ బీ టెక్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న ఇంటరాక్టివ్ సెషన్‌ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టరెడ్డి ప్రారంభించి, విలువైన ప్రసంగం అందించారు. భారత దేశ భవిష్యత్తును మలిచే సాం కేతిక విజ్ఞానానికి వేగంగా పెరుగుతున్న ప్రా ధాన్యతను వివరించి, విద్యార్థులు ఆవిష్కరణ, నిరంతర నైపుణ్యాభివృద్ధి, నైతిక విలు వలతో కూడిన సాంకేతిక వినియోగం, ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సుపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు.
భారత రాజ్యాంగంలోని ప్రాస్తావికంలోని సార్వభౌమత్వం, సామ్యవాదం, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, గణతం త్రం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరి యు సౌభ్రాతృత్వం వంటి మూలభూత విలువల ప్రాధాన్యతను వివరించి, విద్యార్థులు విద్యా ప్రయాణంలోనూ, వృత్తి జీవితంలోనూ ఈ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని ప్రేరేపించారు. కేజీ రెడ్డి కాలేజ్ డైరీని ప్రొఫెసర్ డా. బాలకిష్ట రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ ఎల్‌ఎన్ కె కృష్ణరెడ్డి, డీన్ అకడెమిక్స్ నరసయ్య, అరిస్టాటిల్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.