29-01-2026 03:52:51 PM
కౌటాల (విజయ క్రాంతి): మేడారం జాతరలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని కస్తూరి సునీత, కస్తూరి అక్షిత మృతి చెందడం తీవ్ర విషాదం కలిగించిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే ఆయన ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పోచం, కార్తీక్, నవీన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.