18-08-2025 02:01:30 AM
కొత్తపల్లి, ఆగస్టు 17 (విజయ క్రాంతి): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ సహ సంపర్క ప్రముక్ కుమ్మరి కుంట సుధాకర్ జి పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించబోయే శతాబ్ది ఉత్సవాల సందర్బంగా ఆదివారం చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలోని ఫంక్షన్ హాల్ తిమ్మాపూర్ ఖండ స్వయం సేవకుల సమ్మేళన సమావేశం నిర్వహించారు.
ఈ సమ్మేళనానికి ముఖ్య వక్త గా హాజరైన కుమ్మరి కుంట సుధాకర్ జి మాట్లాడుతూ 1925 అక్టోబర్ 2 నాగ్ పూర్ లో ప్రారంభిం చబడిన సంఘం ఈ ఏడాది అక్టోబర్ తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నదని పేర్కొన్నారు. కేవలం నలుగురు వ్యక్తులతో ఏర్పాటు చేయబడిన సంఘం నేడు లక్షలాది మంది స్వ యం సేవకులతో విరాజిళ్లుతున్నదని తెలిపారు.
రాబోయే శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఖండ స్థాయిలోని ఉప మండలాల గ్రామాల్లో శాఖ కార్యక్రమాలను నిరంతరంగంగా నిర్వహించడం, ప్రతీ ఇంటికి వెల్లి సంఘం లక్ష్యాలను వివరించడం, దసరా ఉత్సవాలలో హైందవ సమాజాన్ని పాత్రులను చేయడం, పథ సంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించడం లాంటి లక్ష్యాలను విజయవంతం చేసే దిశగా ప్రతీ స్వయం సేవక్ కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశం లో ప్రాంత సామాజిక సమరత సహ కార్యదర్శి పుల్లూరి రామారావు , ఖండ కార్యవాహ ఆవుల కుమార్ జి, జిల్లా శారీరక్ ప్రముక్ కాముటం వినీత్, జిల్లా సేవా ప్రముక్ సంపత్ జి, నర్సింగ్ జి తదితరులు పాల్గొన్నారు.