calender_icon.png 19 August, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీటీసీ కుంటయ్య కూతురి వివాహానికి హాజరైన కేటీఆర్

18-08-2025 02:02:50 AM

రాజన్న సిరిసిల్ల: ఆగష్టు 17(విజయక్రాంతి) జిల్లాలో తంగళ్ళపల్లి మండలం అంకుసా పూర్ మాజీ ఎంపిటిసి , బి అర్ ఏస్ నేత కర్కబోయిన కుంటయ్య కూతురు లక్షిత భార్గవి వివాహానికి బి అర్ ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రం లోని తెలంగాణ భవన్ లో వివాహం జరుగగా, కే టీ అర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇటీవలే కుంటయ్య కాంగ్రెస్ నేతల, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కుంట య్య కుటుంబానికి కేటీఆర్ అండగా ఉంటానని, ఇద్దరు కూతుర్ల వివాహాలు చేపిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసింది. ఇచ్చిన హామీ మేరకు చిన్న కూతురుకు రూ.3 లక్షలు అందజేశారు. కుంటయ్య ఆత్మహత్య చేసుకోక ముందే పెద్ద కూతురు వివాహం నిశ్చయమైంది.

ఈ క్రమంలో ఆదివారం పెద్ద కూతురు భార్గవి వివాహం తెలంగాణ భవన్లో ఘనంగా జరిగింది. వివాహానికి హాజరై నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. కూతురు వివాహానికి ఇచ్చిన మాట ప్రకారం ఆదుకున్న కేటీఆర్ కు కుంటయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని వెల్లడించారు.