18-08-2025 02:00:06 AM
కరీంనగర్,ఆగస్ట్ 17(విజయక్రాంతి):వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో చికిత్స పొందిన అర్హులైన వారిని సిఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ముకరంపురలోని నగర కాంగ్రెస్ కార్యాలయంలో అన్నీ కలిపి అయిదు లక్షల ముప్పు వేల రూపాయల సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సహాయం అం దుతుందని ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుందని అన్నారు.నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కరీంనగర్ నియోజక వర్గ ప్రజలకు ఎంతగానో ఉప యోగపడుతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
చెక్కులు పొందిన వారిలో మిర్జా ఉర్బాన,గాలిప ల్లి అనూష,మంతెన విజయ,పథకాల శోభారాణి, తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో శ్రవణ్ నాయక్,మూల రవీందర్ రెడ్డి,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,షబానా తదితరులు పాల్గొన్నారు.