calender_icon.png 5 October, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటారంలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్

05-10-2025 05:30:47 PM

కాటారం (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) శత జయంతి ఉత్సవాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఆదివారం పథ సంచలన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కాటారం కేంద్రంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను విస్తృత పరుస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విభాగ్ ప్రచారక్ విగ్నేశ్వర్ జి పాల్గొని సంఘ సేవకులకు దిశా నిర్దేశం చేశారు.

కాటారం, మహాదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాల నుంచి వచ్చిన స్వయంసేవక్ సంఘ్ సేవకులు గారేపల్లిలోని అయ్యప్ప దేవాలయం నుంచి బస్టాండ్ మీదుగా రూట్ మార్చ్ పథ సంచలన్ నిర్వహించారు. సేవకులు తెల్లటి చొక్కా, ఖాకి ప్యాంటు ఘనవేష ధరించి, కాషాయ ద్వజాన్ని చేత భూని మండల కూడలిలోని పురవీధుల గుండా పథ సంచలన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు కొట్టే శంకరయ్య, అనంతుల రమేష్ బాబు, కామెడీ శ్రీనివాసరెడ్డి, పాగే రంజిత్, భాస్కర్ రెడ్డి, గోపాల్, డాక్టర్ రఫీ, ఈర్నాల సుమన్ తదితరులు పాల్గొన్నారు.