calender_icon.png 5 October, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి

05-10-2025 07:47:18 PM

బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నరసింహులు గౌడ్ అధ్యక్షతన పార్టీ సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ రత్న కుమార్ హాజరయ్యారు. సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచులు విజయం సాధించాలనే దిశగా వ్యూహరచన చేపట్టారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళి, గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 13 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకపోవడం ద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని నేతలు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థాయిలో ప్రజలకు తెలియ జేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మైలారం గ్రామానికి చెందిన 20 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు టేకుర్ల సాయిలు, వెంకట్ సార్, గంపల శంకర్, అల్లం రాములు, లక్ష్మణ్, గంగాధర్, సాయిలు, శ్రీనివాస్ గౌడ్, రాజు, రేహాన్, రాము, శ్రీను, భూమయ్య, సాయిలు, లక్ష్మణ్, దత్తు, బద్రి, దేవి, మోచి, గణేష్, ఎజాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.