calender_icon.png 5 October, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజల మనసులో బీఆర్ఎస్ పై విశ్వాసం

05-10-2025 07:21:18 PM

మెట్ పల్లి (విజయక్రాంతి): కొట్లాడి తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పై తెలంగాణ ప్రజల మనసులో విశ్వాసం ఉందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంగా మెట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో విస్తృత సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై చర్చించి, ప్రతి గ్రామంలో పార్టీ బలం పెంపుదల, కార్యకర్తల సమన్వయం, ప్రజలతో నిరంతర సంబంధం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ ప్రజల మనసులో బీఆర్ఎస్ అంటే విశ్వాసం, అభివృద్ధి, శాంతి మన నాయకుడు కేసీఆర్ రాష్ట్ర నిర్మాణం నుంచి ప్రతి ఇంటికి అభివృద్ధి పథం చూపారు అన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాలేశ్వరం వంటి ప్రాజెక్టులు ఆయన దూరదృష్టికి నిదర్శనం. రైతు, విద్యార్థి, మహిళ, కార్మికుడు ప్రతి వర్గం బీఆర్ఎస్ పాలనలో గౌరవంగా బతికాడు అని తెలిపారు. ఇరవై రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పాలన పూర్తిగా స్తంభించింది. ప్రజలు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.