05-10-2025 07:34:42 PM
పాపన్నపేట (విజయక్రాంతి): దేశం కోసం.. ధర్మం కోసం ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) శారీరక, భౌతిక జిల్లా ప్రముఖు తోట రవి పేర్కొన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖండ కార్యవహ ఆధ్వర్యంలో స్వయం సేవకులు పూర్తి గణవేశ ధరించి పాపన్నపేటలోని పురవీర గుండా పదసంచలన్ నిర్వహించారు. అనంతరం నెహ్రూ చౌరస్తాలో ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట, టేక్మాల్ మండలాల స్వయం సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.