calender_icon.png 5 October, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

05-10-2025 07:40:35 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ఆదివారం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీవో ఎన్ రవి, జెడ్పిపి సీఈవో మట్టపల్లి సంపత్ రావులు పాల్గొన్నారు. అనంతరం కడిపికొండ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్న చుంచుకాల లింగారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నడిపెల్లి వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కోశాధికారి స్వామి రావు, లింగంపల్లి పాపారావు, పిన్నింటి వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.