05-10-2025 07:32:05 PM
ఈతకు వెళ్లి చెరువులో మునిగి యువకుడు మృతి..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముకుందాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ముద్దయిపేట చెరువులో ఈతకు వెళ్లిన చినావత్ సునీల్ కుమార్(18) అనే యువకుడు చెరువులో ఈ ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి ప్రయత్నించి మధ్యలో నీటి ఉధృతికి తట్టుకోలేక నీట మునిగి మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, స్నేహితుల రోదన మిన్నంటింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.