calender_icon.png 7 October, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు దుర్మార్గం

07-10-2025 01:42:14 AM

8న బస్‌భవన్ వద్ద ఆప్ నిరసన

ముషీరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు దుర్మార్గం అని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు బుర్ర రాము గౌడ్, విజయ్ మల్లంగి, ఎంఏ. మాజీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే విద్యార్థుల బస్సు పాసులు 30%, 50%  పెంచిన ప్రభుత్వం, మళ్లీ నేడు హైదరాబాద్ ప్రజలపై మరోసారి బస్సు చార్జీలు పెంచి  పేద మధ్యతరగతి కుటుంబాల సంపదను దోచుకుం టుందని మండిపడ్డారు. హైదరాబాద్ లిబర్టీ  ఆప్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా  సమావేశంలో వారు మాట్లాడు తూ..  50%  బస్సు చార్జీలను పెంచడం  కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి  లేదని స్పష్టమవుతుందని విమర్శించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు ఉచిత బస్సు రవాణా పథకం కల్పిస్తూ, పురుషులపై ఎటువంటి చార్జి పెంపుల  భారం మోపలేదన్నారు. పెంచిన బస్ చార్జీలకు నిరసనగా 8న బస్ భవన్ వద్ద  ఆప్ నిరసన చేపడుతామన్నారు.