calender_icon.png 24 December, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో ఆదుకునేలా శిక్షణ

24-12-2025 02:31:17 AM

  1. శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఆపద మిత్రులు

ధ్రువపత్రాలను అందజేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

సికింద్రాబాద్/ కంటోన్మెంట్ డిసెంబర్ 23 (విజయ క్రాంతి): యువ ఆపద మిత్రులు సిద్ధమయ్యారు. హైడ్రాలో వారం రోజుల శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఆపద సమయంలో ఎలా తనను తాను రక్షించుకోవాలో.. చుట్టు పక్కల వారిని ఎలా కాపాడా లో తెలుసుకున్నారు.  ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు మొదటి రెస్పాండెంట్గా ఎలా స్పందించాలో అవగాహన తెచ్చుకున్నారు. హైడ్రా ఆధ్వర్యంలో యువ ఆపద మిత్ర శిక్షణ పూర్తి చేసుకున్న 78 మంది వాలంటీర్లకు మంగళవారంహైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ధ్రువపత్రా లను అందజేశారు. 

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రారంభించిన యువ ఆపద మిత్ర పథకంలో భాగంగా నిజామాబాద్ లోని గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఎంపికైన 78 మంది వాలంటీర్లకు గత బుధవారం హైడ్రాలో శిక్షణ ప్రారంభమైన విషయం విధితమే. వారం రోజుల శిక్షణ పూర్తయిన సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వారితో మాట్లాడారు. శిక్షణ ఎలా జరిగింది.. ఏం నేర్చుకున్నారో నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. 

సాధన చేస్తే ఏదైనా సాధించొచ్చు..

సాధన చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని యువ ఆపద మిత్ర వాలంటీర్లకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.వారం రోజుల హైడ్రా శిక్షణలో నేర్చుకున్న అంశాలతో పాటు.. మీరు గొప్ప వ్యక్తులుగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడంలో కూడా పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మీరంతా యువ ఆపద మిత్రులు, మీ ప్రత్యేకతను చాటాలని సూచించారు. ప్రమాద సమయంలో గందరగోళానికి గురి కాకుండా.. తక్షణ సహాయకు లుగా రంగంలోకి దిగాలన్నారు. తర్వాత వివిధ విభాగాలకు చెందిన వారితో సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు.

అందుకే క్షేత్ర స్థాయిలో పరిస్థితులను కూడా ఈ శిక్షణలో భాగం చేశామన్నారు. తోటివారికంటే మీరు ముందుండడమే కాదు సహ చరులకు కూడా అవగాహన కల్పించి ఆపద సమయంలో మీతో కలసి పని చేసేలా సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. జిల్లాల్లో కూడా ఇలాంటి శిక్షణ ఉంటే బాగుంటుందని విద్యార్థినులు చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటా మన్నారు. ప్రతి ఒక్కరికీ ఈ శిక్షణ అవసరముందని చెప్పారు. 

ధైర్యాన్ని పెంచిన హైడ్రా శిక్షణ

హైడ్రా శిక్షణలో అనేక విషయాలు తెలుసుకున్నామని యువ ఆపద మిత్ర వలం టీర్లు తెలిపారు. బయట ప్రపంచాన్ని చూశామన్నారు. ప్రభుత్వ విభాగాలు ఎలా పని చేస్తున్నాయో తెలుసుకున్నామని చెప్పారు. ఈ వారం రోజుల పాటు నేర్చుకున్న లైఫ్ స్కిల్స్ జీవితాంతం ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. ప్రమాద సమయంలో గందరగోళానికి గురి కాకుండా.. ఎలా స్పం దించాలి,. ఎలా నివారించాలి.. అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాం. పాఠ్యాం శాల బోధన కూడా ఇలా జరిగితే.. ఎంతో ఉపయోగంగా ఉంటుందని వాలంటీర్లు తెలిపారు.

తరగతి గదిలో విషయాలను విని.. క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్‌గా తెలుసుకున్నామన్నారు. ఈ శిక్షణతో మాలో ఎంత ధైర్యం వచ్చింది. మాతో పాటు తోటివారిని రక్షించే విధంగా మేమంతా సిద్ధమయ్యామని సంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, తోటివారితో ఎలా మాట్లాడాలి ఇలా అనేక అంశా లు తెలుసుకున్నాం. హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

హైడ్రా కమిషనర్‌ఏవీ రంగనాథ్ తో రెండుసార్లు కలిసే అవకాశం రావడం.ఈ సందర్భంగా చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయని వాలంటీర్లు చెప్పారు. ఈ కర్యక్రమంల హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్ ఆర్.సుదర్శన్,ఆర్ ఎఫ్ వో జయప్రకాష్, డీఎఫ్వో గౌతమ్, ఏడీఎఫ్వో మోహనరావు, మై భారత్ స్టేట్ కోర్డినేటర్ రాజేష్ తో పాటుఎస్ ఎఫ్ వోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.