calender_icon.png 15 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు!

15-01-2026 12:52:56 AM

  1. పురుషులకు భారమైన ప్రయాణం 

ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల అసహనం

సిద్దిపేట, జనవరి 14 (విజయక్రాంతి): పండగల వేళ ప్రయాణికులకు ఆర్టీసీ ప్రయా ణం అదనంగా భారం అవుతుంది. స్పెషల్ ట్రిప్ పేరుతో అందినకాడికి దండుకుంటూ ప్రజలను ఇబ్బందుల గురి చేస్తుందని ప్రయాణికులు మండిపడుతున్నారు. సాధారణ రోజులలో జరిగే ప్రయాణంతో పోలిస్తే పండగలకు ప్రయాణం ఇబ్బందులతో పా టు అధికంగా చార్జీలు విధించడం దారుణమని ఆరోపిస్తున్నారు.

సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు సాధారణంగా ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.150, డీలక్స్ బస్సుకు రూ.170 చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పండగలకు ప్రయాణం చేసే వారికి స్పెషల్ బస్సు ఏర్పాటు చేశామంటూ బోర్డు తగిలించి ఎక్స్ ప్రెస్ కు రూ.150 నుంచి రూ.230, డీలక్స్ బస్సుకు రూ.170 నుంచి 260 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాదుకు మాత్రం సాధారణ రోజులలో మాదిరిగానే ఛార్జీ వసూలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ ఖర్చుకు ఆర్టీసీ శాఖ ప్రయాణం చేసిన ఖర్చు మరింత భా రం పెరుగుతుందని ఆవేదన చెందుతున్నారు.

పండగకు గ్రామాల్లోకి వచ్చిన ప్రజ లు తిరుగు ప్రయాణంలో పెంచిన ఛార్జీలను అమలు చేస్తారు. ఇలా ప్రతి పండుగకు ప్రత్యేక బస్సుల పేరిట చార్జీలు పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నారని ప్రజల నుం చి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావడం పురుషులకు మాత్రమే చార్జీల భారం పెంచడం మరింత ఇబ్బంది కలిగిస్తుంది.

మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి పురుషుల వద్ద డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. దూర ప్రయాణమైన సొంత వాహనాలను తీసుకెళ్లాలడంపై పురుషులు ఆసక్తి చెబుతున్నారని దాంతో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రయాణికుల మీద భారం పడకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

పని భారం వల్లనే...

ఆర్టీసీలో బస్సుల, ఉద్యోగుల కొరత వల్ల ప్రయాణికులకు సరిపడా బస్సులను ఆర్టీసీ నడపలేక పోతుందనీ, ఉన్న బస్సులను వినియోగిస్తూ డ్యూటీ గంటల ముగిసినక కూడా ఉద్యోగులకు అదనంగా పని చేపించడం వల్ల నిబంధనల మేరకు ఉద్యోగులకు అదనంగా జీతాలు ఇవ్వాల్సి ఉంటుందనీ, అందుకే స్పెషల్ బస్సులు అరెంజ్ చేస్తూ చార్జీ అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదని అందుకే రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యానికి చేరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.