19-11-2025 01:25:26 PM
రానున్న రోజుల్లో బీసీ రిజర్వేషన్ కోసం ఉధృతంగా ఉద్యమిస్తాం
రేపటి శాంతియుత ధర్నా, రాస్తారోకోను విజయవంతం చేయండి
బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసిందని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపకుండా బీసీలకు అన్యాయం చేస్తుందని కేంద్రం పై పోరాడాల్సిన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయడం సిగ్గుచేటు అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఉదయం 10 గంటలకు రాస్తారోకో నిర్వహించనున్నట్లు ఈ రాస్తారోఖోను, శాంతియుత ధర్నాను జిల్లాలోని బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు డిసెంబరు ఒకటి నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై పోరాడాలని అన్నారు, కేంద్ర ప్రభుత్వం తక్షణమే రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి ఆమోదించాలన్నారు బీసీలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని రానున్న రోజుల్లో ఓట్ల ద్వారా బీసీ వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్తాం అన్నారు