calender_icon.png 14 August, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూల్స్‌గీల్స్.. జాన్తానై!

13-08-2025 01:11:48 AM

  1. అనుమతుల మాటున అక్రమనిర్మాణాలు

హైటెక్ జోన్‌లో హైరైజ్‌భవనాలు

శేరిలింగంపల్లి సర్కిల్‌లో బడా బిల్డింగ్‌లు

బల్దియా ఆదాయానికి పెద్దమొత్తంలో గండి

అక్రమ నిర్మాణాలకు శేరిలింగంపల్లి కేరాఫ్‌అడ్రస్‌గా మారింది. అనుమతుల మాటు న అడ్డగోలు నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమార్కులు బల్దియా ఆదాయానికి గండికొడు తున్నారు. నిబంధనలు కాగితాల వరకే కనిపిస్తున్నాయి. అధికారులు కూడా మా మూళ్లకు ఆశపడి గమ్మున గుడ్లు తేలేసి చూస్తున్నారు. 

శేరిలింగంపల్లి, ఆగస్టు 1౨: హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రీమియం జోన్గా పేరు న్న శేరిలింగంపల్లి పరిధి ఇప్పుడు అక్రమ నిర్మాణాల గూటిగా మారిపోయింది. వేల సంఖ్యలో అనుమతి లేకుండా భవనాలు, కాంక్రీట్ జంగి ల్లా ఎగిసిపడుతున్నా బల్దియా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. శేరిలింగంపల్లి సర్కిల్ 20, చందానగర్ సర్కిల్ 21 పరిధుల్లో అనుమతులు ‘స్టిల్ట్ ప్లస్ టూ’ వరకు మాత్రమే ఉన్నా భవనాలు మాత్రం స్టిల్ట్ ప్లస్ 5, 6, 7 అంతస్తులకు ఎగబాకుతున్నాయి. కొన్నిచోట్ల స్టిల్ట్ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని అదనంగా సెల్లార్తో పాటు కమర్షియల్ ఫ్లోర్లు కూడా కట్టేస్తున్నా రు.

ఈ అక్రమ నిర్మాణాలు బల్దియా ఆదాయానికి కోట్ల రూపాయల గండికొడుతు న్నా.. లంచాల రూపంలో కొందరి జేబులు మాత్రం బరువెక్కుతున్నాయి. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్, చందానగర్, మియాపూర్, మాదాపూర్ డివిజన్లలో ఆకాశాన్ని తాకే భవనాలు వరుసగా వెలుస్తు న్నాయి. ముఖ్యంగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో పరిస్థితి మరింత ఘో రం. అక్కడ మొత్తం పర్మిషన్లు ఏమీ లేకపోయినా భవనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ భ వనాలన్నీ బల్దియా అధికారుల మౌనం ముద్రతోనే సాధ్యమవుతున్నాయని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు.

నిబంధనలకు ‘గుడ్బై’

100120 గజాల స్థలాల్లో జీ+1 లేదా జీ+2 కంటే ఎక్కువ కట్టకూడదనే నిబంధన ఉంది. కానీ ఇక్కడ 4050 గజాల స్థలాల్లోనే ఆరు, ఏడు అంతస్తుల కట్టడాలు నిర్మిస్తున్నారు. 150 గజాలకు మించిన స్థలాల్లో పార్కింగ్ కోసం తవ్వకాలు చేయాలని రూ ల్. కానీ జేసీబీతో పక్కింటి పునాదులే కదిలేలా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల గచ్చిబౌలి సిద్ధిఖ్నగర్లో జరిగిన ప్రమాదం కూడా ఇలాంటిదే. అయినా అధికారులపై ఎలాంటి చర్యలూ లేవు.

అధికారుల మౌనమెందుకు?

లోకమంతా కనిపిస్తున్న ఈ అక్రమ నిర్మాణాలు బల్దియా అధికారులకు మాత్రం వరం లా మారాయి. ఒక్కో అంతస్తుకు రూ. 510 లక్ష ల దాక డబ్బులు వసూలు చేస్తూ, నిబంధనలు పక్కనబెట్టి కట్టడాలకు అనుమతులు ఇచ్చే వ్యవస్థ నెలకొంది. రాష్ట్ర ప్రభు త్వం అక్రమ నిర్మాణాలపై పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా అమలు స్థాయిలో మాత్రం గోళ్ల మీద వదిలేసినట్టే.

ఈ వ్యవహారంలో బల్దియా విజిలెన్స్, జోనల్ కమిషనర్ మౌ నం ఎందుకు వహిస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానం కోరుతూ ప్రజలు నిలదీస్తున్నారు. నేను ఇటీవలే ఈ సర్కి ల్ బాధ్యతలు స్వీకరించాను. ఇక్కడి పరిస్థితుల ను సమగ్రంగా పరిశీలిస్తున్నాను. చట్టపరంగా తగిన చర్యలు తీసుకుని, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తాను.

శశిరేఖ (డిప్యూటీ కమిషనర్)చందానగర్ సర్కిల్ 21