05-07-2025 02:04:39 AM
ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న పోలండ్ దౌత్య కార్యాలయం
కీవ్, జూలై 4: ఉక్రెయిన్ నగరమైన కీవ్‌పై రష్యా మరోసారి డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో రష్యా దాడికి దిగినట్టు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. ఈ దాడుల్లో కీవ్ నగరంలో ఉన్న పోలండ్ దౌత్యకార్యాలయం దెబ్బతిన్నట్టు ఉక్రెయిన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించింది.
ఈ దాడి జరుగుతున్నపుడు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులు, సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం సహా వివిధ అంశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం సుదీర్ఘ చర్చలు జరిపారు. రష్యా దాడుల్లో అనేక మౌలిక సదుపాయాలు, పాఠశాలలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు కీవ్ పేర్కొంది. రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిందని పలు రైళ్లు రద్దు చేసినట్టు వెల్లడించింది.